Collector Rizwan Basha | ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
Collector Rizwan Basha | జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
జోగులాంబ గద్వాల : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ( Government Hospital ) లో నిరుపయోగంగా ఉన్న భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, ఆసుపత్రి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Rizwan Basha Sheikh ) అధికారులను ఆదేశించారు.
గురువారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వివిధ విభాగాలు, వైద్య పరికరాలు, సిటీ స్కాన్, ల్యాబొరేటరీ, తదితర పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిటీ స్కాన్ సేవలను సమర్థవంతంగా వినియోగించా లని, ఇన్‌పేషెంట్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రోగుల రద్దీని నియంత్రించేందుకు టోకెన్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
రోగులు ఒకేసారి గుమిగూడకుండా టోకెన్ నంబర్ ప్రకారం సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట అదనపు కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పిల్లలకు అందించే వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు అందుబాటులో ఉన్న గదులను వినియోగించుకోవాలని తెలిపారు.
అవసరమైన మేరకు ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, పిల్లల ఆట స్థలం వంటి సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి అనుకూలంగా ముఖ్యంగా పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే విధంగా గోడలపై ఆరోగ్య అవగాహన చిత్రాలు వేయించే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నర్సింగరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, ఆసుపత్రి పర్యవేక్షకులు ఝాన్సీ లక్ష్మి, ఆర్ఎంవో వెంకట దాస్,అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

