Joseph Ravan | వారం రోజుల పోలీస్ కస్టడీకి యూట్యూబర్ జోసెఫ్ రావణ్..!
Joseph Ravan | యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్‌కు వారం రోజుల పోలీస్ కస్టడీ విధించారు. సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించడం లాంటి తీవ్ర ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ జరిపిన గన్నవరం న్యాయస్థానం గురువారం కీలక ఉత్తర్వులు వెలువరించింది.
Joseph Ravan : యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ రావణ్‌కు వారం రోజుల పోలీస్ కస్టడీ విధించారు. సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించడం లాంటి తీవ్ర ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ జరిపిన గన్నవరం న్యాయస్థానం గురువారం కీలక ఉత్తర్వులు వెలువరించింది.
ఈ కేసు విచారణలో భాగంగా జోసెఫ్‌ను ఏడు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపు (సెప్టెంబరు 18) ఉదయం గన్నవరం పోలీసులు అతడిని కస్టడీకి తీసుకోనున్నారు. యువతను రెచ్చగొట్టేలా వీడియోలు రూపొందించడం, ఏలూరులో నిర్వహించిన ఓ సమావేశంలో నక్సలిజం వైపు మళ్లేలా ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై ఏపీ పోలీసులు ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ కుట్ర వెనుక ఉన్న అసలు నెట్వర్క్, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఉన్న సంబంధాలు, దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాల కోణంలో లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, వారం రోజుల కస్టడీకి అంగీకరించడంతో రాబోయే విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

