IND vs AFG : మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ ఉండగానే గెలుపొందిన భారత్ వైట్‌వాష్‌పై కన్నేసింది. వరసగా రెండు ఓటములతో టీమిండియాకు సిరీస్ సమర్పించుకున్న అఫ్గనిస్థాన్ పరువు కోసం ఆడనుంది. నామమాత్రమైన మూడో టీ20లో టాస్ గెలిచిన అఫ్గన్ సారథి ఇబ్రహీం జద్రాన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే.. అయ్యర్ సేన తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు.
వరసగా రెండు మ్యాచుల్లో విజయంతో సిరీస్ పట్టేసిన టీమిండియా క్వీన్స్లీప్ లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం మూడో టీ20లోనూ అఫ్గనిస్థాన్‌ను ఓడించాలని భావిస్తున్న శ్రేయాస్ అయ్యర్ సేన టాస్ ఓడింది. ఓదార్పు విజయం కోసం ఎదురుచూస్తున్న అఫ్గనిస్థాన్ బలమైన భారత బ్యాటింగ్ లైనప్‌ను ఎంత వరకు నియంత్రిస్తుందో చూడాలి. వరసగా రెండు మ్యాచుల్లో బెంచ్‌మీదే ఉన్న వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో లేడు. ఆఖరి గేమ్‌లో బెంచ్‌ను పరీక్షిస్తామని చెప్పిన కెప్టెన్ అయ్యర్ ఆశ్చర్యంగా పేసర్ యశ్ ఠాకూర్‌కు ఓటేశాడు. కాబూలీ టీమ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
A look at #TeamIndia‘s Playing XI 🙌
Updates ▶️ https://t.co/Zixki4RhPt#AFGvIND pic.twitter.com/kLIhY4VXrX
— BCCI (@BCCI) September 17, 2026
భారత తుది జట్టు : సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్,
యశ్ ఠాకూర్, సుందర్, బుమ్రా, రవి బిష్ణోయ్.
అఫ్గనిస్థాన్ తుది జట్టు : ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), సెడీకుల్లా అటల్, డార్విష్ రసూలి, అజ్మతుల్లా ఒమర్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, నబీ, రషీద్ ఖాన్, ముజీబ్, నూర్ ఉల్ రహమాన్, ఫజల్హక్ ఫారూఖీ.