– తుంగపాడు సర్పంచ్ కడారి శ్రీశైలం యాదవ్
నాంపల్లి, సెప్టెంబర్ 17 : ప్రజలు వినాయకుని పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా ఘనంగా నిర్వహించుకోవాలని నాంపల్లి మండలం తుంగపాడు సర్పంచ్ కడారి శ్రీశైలం యాదవ్ అన్నారు. గురువారం తుంగపాడులో నెలకొల్పిన వినాయకుని మండపాలకు రూ.50 వేలను నిర్వాహకులకు అందజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు ఇవ్వకుండా గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల దేవేందర్, మాజీ ఉప సర్పంచ్ పచ్చిపాల ఆంజనేయులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పులకరం వెంకటయ్య, వార్డు మెంబర్స్ నేతల్ల నర్సింహా, గుండాల శ్రీశైలం, నేతల సత్యనారాయణ, హరికృష్ణ, నరసింహ, శ్రీను, లింగయ్య, మహేందర్, శ్రీకాంత్, చింటు, దండిగా నరేష్, పులకరం అబ్బులు, అంజి, దేవేందర్, కసిరెడ్డి సుధాకర్, మహేష్, గుండాల శివ, మేకల యాదగిరి, పచ్చిపాల అఖిల్ పాల్గొన్నారు.