తుంగతుర్తి, సెప్టెంబర్ 17 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తుంగతుర్తి మండల వ్యాప్తంగా దేవునిగుట్ట తండా, రామన్నగూడెం తండా, సింగారం తండా, మంచే తండా, సూర్య తండా, ఏనకుంట తండా, రావులపల్లి ఎక్స్ రోడ్ తండా, గుట్టకింద తండా, కాశి తండాలో గిరిజనులు కేసీఆర్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… గిరిజనుల దశాబ్దాల కల తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన మహనీయుడు అని కొనియాడారు. గిరిజనులకు ఎస్టీ సబ్ ప్లాన్ తో ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని వెంటనే రేవంత్ రెడ్డి స్పందించి గిరిజన డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బూక్య రవి నాయక్, లాకావాత యాకూ నాయక్, బూక్య ధర్మ నాయక్, గుగులోతు కాలరామ్ నాయక్, వీరోజీ నాయక్, దశరద నాయక్, పూర్ణ నాయక్, పూన్య నాయక్, రవి నాయక్, శంకర్ నాయక్, బూక్య శ్రీను, వీరు నాయక్, ఇన్చార్జిలు తాటికొండ సీతయ్య, గుండగాని రాములుగౌడ్, గుడిపాటి వీరయ్య, మల్లెపాక రాములు, గడ్డం సోమేశ్, గాజుల యాదగిరి, తునికి సాయిలు, చింత కుంట్ల మనోజ్, తెడ్డు హరిబాబు, ఆకారపు భాస్కర్ పాల్గొన్నారు.

కేసీఆర్ చిత్రపటానికి గిరిజనుల క్షీరాభిషేకాలు