War 2 | రీసెంట్గా దేవర పార్ట్-1తో థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). సీక్వెల్‌తో కూడా రెడీ అవుతున్న ఈ స్టార్ యాక్టర్ మరోవైపు టాలీవుడ్, బాలీవుడ్ సినీ జనాలతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న వార్ 2 (War 2)ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ మూవీ షూట్లో భాగంగా ముంబైలో ల్యాండయ్యాడు.
స్పెషల్ సెట్స్‌లో వార్ 2 చిత్రీకరణ కొనసాగుతోంది. 85వ రోజు వార్ షూట్ కొనసాగుతుందంటూ.. తాజా లుక్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. వార్ 2కు సంబంధించి ముఖ్యమైన సీక్వెన్స్ షూట్ కొనసాగుతున్నట్టు తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది. ఈ సారి స్టన్నింగ్ యాక్షన్ ప్యాక్ డ్ రోల్లో కనిపించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన వార్తలు క్లారిటీ ఇచ్చేస్తున్నాయి.
స్పై జోనర్లో వస్తోన్న ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఇప్పటికే షేర్ చేసిన వార్ 2 గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. వార్ 2 YRF Spy Universeలో ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 సినిమాల తర్వాత వస్తున్న ఆరో సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
Shooting In progress @tarak9999 🔥🔥🔥. #War2 #JrNTR #HrithikRoshan pic.twitter.com/hgR9tYWWIH
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) October 21, 2024
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?