Devaki Nandana Vasudeva | టాలీవుడ్ యాక్టర్ అశోక్ గల్లా (Ashok Galla) నటిస్తోన్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ. Ashok Galla 2 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ నటి ఝాన్సీ దేవకి పాత్రలో నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఝాన్సీ లుక్ విడుదల చేస్తూ.. కౌంట్‌డౌన్ పోస్టర్ షేర్ చేశారు.
ఝాన్సీ చేతిలో కర్ర పట్టుకొని పోరుకు బయలుదేరినట్టు కనిపిస్తున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఝాన్సీ తన కొడుకు కోసం ఫైట్ చేసే తల్లిగా కనిపించబోతున్నట్టు పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఝాన్సీ రోల్ సినిమాకే హైలెట్‌గా ఉండబోతుందని హింట్ ఇచ్చేస్తున్నాడు డైరెక్టర్. ఈ మూవీని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది.
Introducing #Jhansi as Devaki – a mother who prays fiercely and stands ready to fight for her son 🔥
Witness her strength in #DevakiNandanaVasudeva in just 1️⃣0️⃣Days 💥
In cinemas from November 14th 🎥#DNVonNov14 🤩@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma… pic.twitter.com/GIQlbxibSF
— Ramesh Bala (@rameshlaus) November 4, 2024
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!