Jathara | సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త కొత్త టాలెంట్స్ తెరపైకి వస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుండటం చూస్తూనే ఉన్నాం. తాజా కంటెంట్‌తో ప్రేక్షకులను థ్రిల్ అందించే కథలను అందించే కొత్తతరం యాక్టర్ల విషయంలో టాలీవుడ్ ముందువరుసలో ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడిదే లైన్లో మరో సినిమా కూడా వస్తుందని ఓ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు.
సతీశ్ బాబు రాటకొండ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న జాతర (Jathara) . ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యాడనిపిస్తోంది. దేవుడు ఆడే జగన్నాటకం.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం అంటూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట రౌండప్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్లో సాగే జాతర నేపథ్యంలో ఉండబోతున్న సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందు రానుంది.
గల్లా మంజునాథ్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై ఎల్ఎల్సీతో కలిసి రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియారాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్, ఆర్కే పిన్నపాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు.
The film #Jathara arriving in cinemas on November 8th pic.twitter.com/wTi6J194gL
— Vamsi Kaka (@vamsikaka) October 23, 2024
Vijay | నటుడు విజయ్ తొలి సభకు భారీ జన సందోహం
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?