Janhvi Kapoor | దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) తల్లి బాటలో పయనిస్తోంది. హిందీతో వివిధ భాషల్లో తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన పాటల్లో అదిరిపోయే డ్యాన్స్‌తో అభిమానులను హుషారెత్తిస్తోంది. మరోవైపు బుచ్చి బాబు సాన-రాంచరణ్ కాంబోలో వస్తోన్న ఆర్సీ 16లో కూడా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న జాన్వీకపూర్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. బీటౌన్ సర్కిల్ టాక్ ప్రకారం జాన్వీకపూర్ ఈ సారి సిద్దార్థ్ మల్హోత్రాతో రొమాన్స్ చేయబోతుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని దినేశ్ జైన్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం అర్బన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో బోల్డ్ కథాంశంతో రాబోతుందట. ఇప్పటికే హిందీలో సన్నీ సంస్కారీ కీ తులసీకుమారి (Sunny Sanskari Ki Tulsi Kumari) సినిమాలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
తారక్‌తో నటిస్తోన్న దేవర ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న తెలుగు, హిందీతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. దేవర లుక్స్, సాంగ్స్‌ను చూస్తుంటే జాన్వీకపూర్ టాలీవుడ్లో లీడింగ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం ఖాయమైపోయినట్టే కనిపిస్తుందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Dil Raju | థంపింగ్ రెస్పాన్స్.. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రపై దిల్ రాజు
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, తారక్ ఫ్యామిలీ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో..!
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే