Jr NTR | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఇటీవలే తన తల్లి శాలినితో కలిసి ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నాడనే సంగతి తెలిసిందే. స్వగ్రామం కుందాపురం ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరిందంటూ తారక్ ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్న ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తారక్ అండ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఫ్యామిలీతో కలిసి బీచ్‌లో సందడి చేసిన స్టిల్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తాజాగా తారక్, ప్రశాంత్ నీల్, కాంతార ఫేం రిషబ్ శెట్టి ఫ్యామిలీ అంతా హిట్ స్టేషన్ అందాలను ఆస్వాదించింది. ఈ సందర్భంగా దిగిన గ్రూప్ ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తారక్ తల్లి శాలినిని కూడా ఈ ఫ్రేమ్‌లో చూడొచ్చు. మొత్తానికి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ యాక్టర్లు, డైరెక్టర్లను ఒకే ఫ్రేమ్‌లో చూసి తెగ మురిసిపోతున్నారు మూవీ లవర్స్. లొకేషన్ స్టిల్ చూస్తే కర్ణాటకలోని ఓ హిల్ స్టేషన్ అని అర్థమవుతోంది.
రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మరోవైపు తారక్ నటిస్తోన్న దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ప్రశాంత్ నీల్-తారక్ కాంబోలో ఎన్టీఆర్ 31ను కూడా ప్రకటించగా.. షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!