Telugu Film Chamber | భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ( Ap Floods)వరద ముంపుతో సతమతమవుతున్నాయని తెలిసిందే. తెలంగాణలో ఖమ్మం, ఏపీలో విజయవాడతోపాటు పలు జిల్లాల్లో వరద ముంపుతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులు ముందుకొచ్చి.. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు.
తాజాగా వరద బాధితులకు మా వంతుగా మేము కూడా అండగా నిలుస్తామని తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఫిలిం చాంబర్ (Telugu Film Chamber) తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి రూ.10 లక్షలు, తెలంగాణకు రూ.10 లక్షలు, ఫెడరేషన్ తరపున రూ.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ఫిల్మ్ చాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు.
రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించిన అకౌంట్ నంబర్స్, ఛాంబర్ నుంచి మరో అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ ఖాతాలకు డబ్బులు పంపించవచ్చని తెలిపారు.
– మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– మహేశ్‌బాబు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 50 లక్షల చొప్పున కోటి విరాళం
– ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూ.కోటి విరాళం
– త్రివిక్రమ్, సూర్యదేవర రాధాకృష్ణ, నాగవంశీ కలిసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 25 లక్షల చొప్పున విరాళం
– సిద్ధూ జొన్నలగడ్డ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 15 లక్షల చొప్పున 30 విరాళం
– విశ్వక్సేన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం
– అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి 5 లక్షల విరాళం
– వైజయంతీ మూవీస్ రూ.45 లక్షలు విరాళంగా ప్రకటించింది.
– ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షలు ప్రకటించింది. స్టార్ యాక్టర్ రాంచరణ్ రూ.కోటి విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించాడు.
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!