Dil Raju | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కాగా.. మంచి టాక్ తెచ్చుకుంది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. ఎస్జే సూర్య (SJ Suryah) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ప్రత్యేకించి ఎస్జే సూర్య పోషించిన సీఐ దయానంద్ పాత్రను థియేటర్లలో ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
సినిమాకు ఎస్జే సూర్యనే హైలెట్ అంటే మూవీలో అతడి పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్ట్స్ రాంచరన్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో కూడా ఎస్జే సూర్య పాత్ర విషయంలో ఇదే మేనియా రిపీట్ కాబోతుందా అంటే అవుననే అంటున్నారు నిర్మాత దిల్ రాజు. ఇదే విషయాన్ని సరిపోదా శనివారం విజయోత్సవ వేడుకలో చెప్పారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్‌లో ఎస్జే సూర్య పాత్రకు థంపింగ్ రెస్పాన్స్ ఉండబోతుంది. ఆయన పాత్రను ప్రేక్షకులు ఘనంగా వేడుకగా జరుపుకుంటారని చెప్పుకొచ్చారు. దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సరిపోదా శనివారం చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిచాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించారు. గేమ్ ఛేంజర్‌లో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో రాంచరణ్ కథానుగుణంగా తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నట్టు తెలుస్తోండగా.. తండ్రి పాత్రకు జోడీగా అంజలి కనిపించనుందట. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తుండగా.. పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
#Gamechanger లో #SJSurya గారికి కూడా పేపర్స్ పడతాయి. – #DilRaju pic.twitter.com/y3jHleAwVo
— Rajesh Manne (@rajeshmanne1) September 5, 2024
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!