మరాఠి ప్రాజెక్టు సైరట్ రీమేక్‌గా వచ్చిన ధడక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Jahnvi Kapoor). ప్రస్తుతం మరో రీమేక్ చిత్రంలో నటిస్తోంది జాన్వీకపూర్. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటిస్తున్న రీమేక్ చిత్రానికి మిలి (Mili) టైటిల్‌ను ఖరారు చేశారు.
అంతేకాదు ఈ చిత్రాన్ని నవంబర్ 4న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమాలో జాన్వీకపూర్ లుక్స్ విడుదల చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించారు. నవ్వుతూ, ఏడుస్తూ, భయపడుతూ..డిఫరెంట్ ఎమోషన్స్ జాన్వీకపూర్ ముఖంలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రం మలయాళ ప్రాజెక్టు హెలెన్‌కు రీమేక్‌గా వస్తుంది.
థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని మథుకుట్టీ జావియర్ డైరెక్ట్ చేస్తున్నాడు. బేవ్యూ ప్రాజెక్ట్స్-జీ స్టూడియోస్ బ్యానర్లపై బోనీకపూర్ నిర్మిస్తున్నారు. మనోజ్ పహ్వా, బిను పప్పు, అజు వర్గీస్, రోనీ డేవిడ్, సన్నీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. జాన్వీకపూర్ మరోవైపు మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ చిత్రాల్లో నటిస్తోంది.
DYING TO SURVIVE! HERE IS THE FIRST LOOK OF #Mili
RELEASING IN CINEMAS ON 4TH NOVEMBER
🔗- https://t.co/HHE2ar333b@BoneyKapoor #JanhviKapoor @sunnykaushal89 @arrahman @Javedakhtarjadu @actormanojpahwa @mathukutty_here @bayviewprojoffl @hasleenkaur @ZeeMusicCompany pic.twitter.com/9UM8TWS04e
— Zee Studios (@ZeeStudios_) October 12, 2022
DYING TO SURVIVE! TEASER at 2.30 pm.@BoneyKapoor #JanhviKapoor @sunnykaushal89 @arrahman @Javedakhtarjadu @actormanojpahwa @mathukutty_here @bayviewprojoffl @hasleenkaur @ZeeMusicCompany pic.twitter.com/0gHDJpf7t6
— Zee Studios (@ZeeStudios_) October 12, 2022
FROZEN BUT NOT SHAKEN! #Mili@BoneyKapoor #JanhviKapoor @sunnykaushal89 @arrahman @Javedakhtarjadu @actormanojpahwa @mathukutty_here @bayviewprojects @hasleenkaur @ZeeMusicCompany pic.twitter.com/gwHCHLxtT7
— Zee Studios (@ZeeStudios_) October 12, 2022
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్