భారత చలన చిత్ర పరిశ్రమలో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు ప్రకాశ్‌రాజ్ (Prakash Raj). ఏ పాత్రకైనా ప్రాణం పోసే ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రకాశ్ రాజ్ నటిస్తున్న తెలుగు సినిమా కోసం డబ్బింగ్ మొదలుపెట్టేశాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు.
టాలెంటెడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) ప్రస్తుతం రంగమార్తాండ (Rangamarthanda) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ తన పాత్రకు డబ్బింగ్ షురూ చేశాడు. డబ్బింగ్ సెషన్ ఈ వారం ముగియనుందని సమాచారం. రంగమార్తాండలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రంగమార్తాండ షూటింగ్ పార్టు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్, కూడా పూర్తి అయ్యాయని, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తయ్యాయని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. రాబోయే మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
.@prakashraaj starts dubbing 🎙️ for #Rangamarthanda@director_kv pic.twitter.com/9pQkRDxCiT
— Vamsi Kaka (@vamsikaka) October 11, 2022
హౌస్‌ఫుల్ మూవీస్-రాజశ్యామల ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందిస్తున్నారు.