ఏడేళ్ల తర్వాత లుక్ మార్చిన జగపతిబాబు
పాతికేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని ఫ్యామిలీ హీరో. శోభన్ బాబు తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా తెలుగు నాట ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు జగపతిబాబు.

పాతికేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీలో ఆయన తిరుగులేని ఫ్యామిలీ హీరో. శోభన్ బాబు తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడుగా తెలుగు నాట ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడు జగపతిబాబు. అయితే ఎలాంటి హీరోకైనా ఒక దశలో ఎక్స్పైరీ డేట్ వస్తుంది. ఆయన మార్కెట్ పడిపోతుంది. అది పట్టించుకోకుండా సినిమాలు చేస్తే ఎదురు దెబ్బలు తప్ప మరొకటి ఉండవు. దానికి తోడు కెరియర్ కూడా దెబ్బతింటుంది. అయితే అలాంటి తప్పులు చేయకుండా హీరోగా తన మార్కెట్ తగ్గిన తర్వాత తనకు తానుగా ప్రతినాయకుడిగా మారిపోయాడు జగపతిబాబు. లెజెండ్ సినిమా ఈయన లోని మరో నటుడిని బయటకు తీసుకొచ్చింది.
అప్పటి వరకు సాఫ్ట్ కోర్ సినిమాలు చేస్తూ వచ్చిన జగపతిబాబు.. లెజెండ్ సినిమాలో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. అహంకారం ఒంటి నిండా ఉన్న జితేంద్ర పాత్రలో ఒదిగిపోయాడు. హీరోగా కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకోలేదు.. కానీ విలన్ గా మాత్రం రెండు కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకొని సంచలనం సృష్టించాడు జగపతి బాబు. కొన్నేళ్లుగా గడ్డంతోనే కనిపిస్తున్నాడు ఈయన. హీరోగా ఉన్నప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే వాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన తర్వాత పూర్తిగా ఆ లుక్కు మార్చేసి గడ్డం బాబుగా మారిపోయాడు. కానీ దాదాపు ఏడేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్లీ పాత జగపతి బాబు ను పరిచయం చేశాడు ఈయన.
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్స్ లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉన్నాడు బాబు. ఈ క్రమంలోనే కొత్త లుక్ లోకి మారిపోయాడు. గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసుకుని కుర్ర హీరోలకు పోటీగా వచ్చేశాడు. ఇదేదో కొత్త సినిమా కోసం చేసింది కాదని.. ఇంట్లో ఖాళీగా ఉండి ఏడేళ్ళ తర్వాత ఇలా పూర్తిగా మారిపోయాను అంటూ అభిమానులకు చెబుతున్నాడు జగపతి బాబు. ప్రస్తుతం ఈయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్నాడు జగపతిబాబు.
ఇవికూడా చదవండి..
Video Player is loading.https://imasdk.googleapis.com/js/core/bridge3.462.0_en.html#goog_1601936580
Video Player is loading.PauseUnmuteLoaded: 0.00%Fullscreen
డబ్బింగ్ ఆర్టిస్టుగా తరుణ్..!
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
బాలయ్య-గోపీచంద్ మూవీకి మ్యూజిక్ కంపోజర్ ఎవరంటే..?
10 టీజర్లు,13 మోషన్ పోస్టర్ల తో ప్రమోషన్‌కు ప్లాన్..!
ఓటీటీ రిలీజ్..క్లారిటీ ఇచ్చిన యువ హీరో..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
Recommended Content by ntnews.comVideo Player is loading.Skip
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
Kamal Hassan | దేశ విధానాలను బిలియనీర్లు నిర్దేశించలేరు.. ఎలాన్ మస్క్‌కు కమల్ హాసన్ కౌంటర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

