శనివారం 06 జూన్ 2020
Cinema - May 06, 2020 , 09:10:05

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ గురించి నాని చెప్పిన తొలి ముచ్చ‌ట‌

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’  గురించి నాని చెప్పిన తొలి ముచ్చ‌ట‌

టాలీవుడ్ చ‌రిత్రలో చిర‌స్థాయిగా నిలిచిపోయే కొన్ని చిత్రాల‌లో  వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సి.అశ్వనీదత్ నిర్మాతగా కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఒక‌టి. .ఈ సినిమా మే 9వ తేదితో 30 యేళ్లు పూర్తి చేసుకుంటున్న‌ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు తెలియని విషయాలను నాని చెబుతున్నాడు. తొలి స్టోరీని తాజాగా వీడియో రూపంలో వివ‌రించాడు హీరో నాని.

బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి. కానీ తరాలు మారినా.. ఎవర్ గ్రీన్ ఉండే బ్లాక్ బస్టర్ సినిమా లిస్టులో ఉండే మొదటి సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఓ సినిమాను చూసే విధానాన్ని మార్చిన ఈ చిత్ర కథ ఎలా పుట్టింది అనే దానిపై నాని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అశ్వినీదత్‌ కి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ‘జగదేకవీరుని కథ’ లాంటి ఫాంటసీ కథ చిరంజీవితో చేయాలనే కోరిక ఉండేదట. అది కూడా తను ఎంతో ప్రేమగా బావ అని పిలిచే రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరనే గట్టి నమ్మకం ఉండేదట. 

నాగార్జున, శ్రీదేవిలతో ‘ఆఖరి పోరాటం’ తర్వాత చిరంజీవితో సినిమా చేయాల‌నుకున్నారు అశ్వినీద‌త్‌.  ఈ సందర్భంగా దత్తుకు క్లోజ్ ఫ్రెండ్ అయిన కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తిని, రాఘవేంద్రరావుతో కలిపి తిరుపతికి పంపారు. సరిగ్గా తిరుమల కొండపై ఉండగా అశ్వినీదత్ మనసు తెలిసిన శ్రీనివాస చక్రవర్తి దేవకన్య భూమిపైకి వచ్చినపుడు ఆమె ఉంగరం పోగుట్టుకుంటుంది. అది హీరోకు దొరుకుతుంది. అని కొంచెం ఊహాజనితంగా ఈ కథ ముఖ్యపాయింట్‌ను చెప్పారు. అది రాఘవేంద్రరావుకు బాగా నచ్చింది.ఈ స్టోరీని అశ్వినీదత్ విని ఓకే చేసారు. ఆ తర్వాత మరి జగదేక వీరుడికి జోడిగా అతిలోకసుందరి ఎవరు ? అందరి మదిలో శ్రీదేవి పేరు వినిపించింది.   వైజయంతి మూవీస్ ఆస్థాన క‌థానాయిక శ్రీదేవిని ఫైన‌ల్ చేశారు. 

ఇక చిత్ర కథకు ఒక రూపం ఇవ్వడానికి రాఘవేంద్రరావు ..జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి, విజయంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ వంటి చాలా మంది రచయత‌ల‌తో కలిసి ఈ సినిమా కథకు ఓ రూపం తీసుకొచ్చారు. వారితో కలిసి చిరంజీవి కూడా కథా చర్చల్లో పాల్గొన్నారు. ఇక దేవకన్యగా అతిలోకసుందరి చూపిస్తున్నపుడు నేను కొంచెం మాసిన గడ్డంతో ఉంటే బాగుంటుంది కదా అనే సలహా కూడా ఇచ్చారట. దీంతో సామాన్య‌ ప్రేక్షకులు కథతో కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు.

మరోవైపు శ్రీదేవి ఈ సినిమాలో తన కాస్ట్యూమ్స్‌కు తానే కుట్టించుకోవడం మొదలపెట్టారట. అలా అందరూ కలిసి ఈ చందమామ కథకు అందమైన రూపు ఇచ్చారు. అలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం క్లాసిక్‌గా నిలిచిపోయింది. చరిత్రను సృష్టించిన ఈ సినిమా కథ అంతా ఈజీగా అయిపోయిందనుకుంటున్నారా ? లేదు మానవా.. చాలా స్టోరీ చాలా మిగిలే ఉంది. ఈ కథ వెనక ఉన్న రెండో స్టోరీని 7వ తేదిని సినీ ప్రేక్షకులకు ముందుకు రానుందని చెప్పుకొచ్చారు నేచుర‌ల్ స్టార్ నాని.logo