డెహ్రాడూన్: వివాహ వేడుకలు, కుటుంబ కార్యక్రమాల్లో అట్టహాసం, ఆడంబరాల ప్రదర్శనలకు కళ్లెం వేయాలని ఉత్తరాఖండ్‌లోని కంధర్ గ్రామస్థులు నిర్ణయించారు. ఇటువంటి కార్యక్రమాలకు హాజరయ్యే పెండ్లయిన మహిళలు కేవలం మంగళసూత్రం, ముక్కుపుడక, చెవి దుద్దులను మాత్రమే ధరించాలని చెప్పారు.
వస్ర్తాలు, ఆభరణాలు వంటి వాటిని అట్టహాసంగా ప్రదర్శించడాన్ని కట్టడి చేసినపుడే, సమాజంలో నిజమైన సమానత్వం వస్తుందని తెలిపారు. గ్రామ పెద్ద భరత్ సింగ్ రాణా మాట్లాడుతూ ఈ నిబంధనను ఉల్లంఘించే వారికి రూ.50,000 జరిమానా విధిస్తామని చెప్పారు. దీనిని గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు.