Nagarjuna| అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss 8 Telugu). ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా సెలబ్రిటీలు తమ తమ సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా షోలో నాగార్జునతో కలిసి సందడి చేస్తున్నారు.
ఇప్పటికే కంగువ ప్రమోషన్స్‌లో భాగంగా సూర్య, నాగార్జున సందడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మరో స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ నటిస్తోన్న అమరన్ (Amaran) టీం కూడా నాగ్‌తో జతకట్టింది. ఈ చిత్రం అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అమరన్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా శివకార్తికేయన్, సాయిపల్లవి అండ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి బిగ్ బాస్‌లో సందడి చేశారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ దీపావళి కానుకగా ప్రీమియర్ కానుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్రలో నటిస్తుండగా.. సాయిపల్లవి (Sai Pallavi) మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్ర పోషిస్తోంది.
Tune in now! #Amaran team’s promotion #BiggBossTelugu8 on @starmaa @iamnagarjuna ✨#AmaranDiwali #AmaranOctober31 #MajorMukundVaradarajan#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
A Film By @Rajkumar_KP@ikamalhaasan @Siva_Kartikeyan… pic.twitter.com/ZQoetaiL6H
— Magizhmandram (@magizhmandram) October 27, 2024
Vijay | నటుడు విజయ్ తొలి సభకు భారీ జన సందోహం
Lucky Baskhar | ప్రతీ అభిమాని కాలర్ ఎగరేస్తారు.. దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్పై వెంకీ అట్లూరి
Zebra | సత్యదేవ్ జీబ్రా దీపావళికి రావడం లేదు.. ఎందుకో మరి..?