Radhe shyam | ప్రభాస్ సినిమాలపై ఇప్పుడు అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కథ నచ్చితే ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. కథ డిమాండ్ చేస్తే ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు ఈ నిర్మాతలు. హీరోల మార్కెట్‌తో సంబంధం లేకుండా కథ నచ్చితే క్వాలిటీ ఆఫ్ సినిమా ఇవ్వడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. మిర్చి సినిమా నుంచి జిల్, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలు ఈ నిర్మాతల అభిరుచి ఏంటో తెలియజేస్తుంది.
రెండేళ్ల కింద సాహోతో ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించారు. ఇప్పుడు మరోసారి తమ నిర్మాణ విలువలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ రాధే శ్యామ్ సినిమాను యు.వి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి 2022 సంక్రాంతికి రాధే శ్యామ్ విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మధ్య గండికోటలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు.
ఇటలీలో కొన్ని పరిస్థితుల కారణంగా షూటింగ్‌కు అనుమతి లభించకపోవడంతో.. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అద్భుతమైన ఇటలీ సెట్ నిర్మించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ భారీ సెట్ నిర్మాణం జరిగింది. ఇక్కడే చాలా వరకు షూటింగ్ పూర్తి చేశాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. టీజర్లో కూడా ఈ సెట్‌ను అద్భుతంగా చూపించారు. నిజంగానే ఇటలీలో ఉన్నట్లు అనిపించింది. ఈ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని భావిస్తున్నారు. సాహోలో యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం కోట్లు ఖర్చు చేసిన యూవీ క్రియేషన్స్.. ఇప్పుడు ప్రేమ కథ కోసం మరోసారి అదే చేస్తున్నారు. కథ డిమాండ్ చేసిందని ఏకంగా ఒక దేశం సెట్‌ను నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో అత్యద్భుతమైన టెక్నికల్ టీం సహకారంతో.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వందల కోట్ల బడ్జెట్‌తో రాధే శ్యామ్ లాంటి ఒక క్లాసిక్ లవ్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది యూవీ క్రియేషన్స్. ఈ నిర్మాతలు చేస్తున్న సినిమాలు.. దానికి ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందన వీళ్ల సక్సెస్ ఏంటో తెలియజేస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!