RRR vs KGF Chapter 2 | రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత అదే స్థాయి అంచనాలతో విడుదలవుతున్న మరో సినిమా కేజీఎఫ్ 2. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఎందుకంటే మొదటి భాగం సృష్టించిన సంచలనాలు అలా ఉన్నాయి మరి.
కన్నడ మినహా మిగిలిన భాషల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్.. ఏకంగా రూ.240 కోట్లకు పైగా వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే రెండో భాగంపై అంచనాలు పెంచింది. బాహుబలి 2 తర్వాత అంతటి అంచనాలతో కేజీఎఫ్ 2 వస్తుంది. అయితే కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో వస్తాయా అంటే మాత్రం అది కాస్త కష్టమే. ఎందుకంటే బాహుబలి 2 ఏకంగా 1800 కోట్లు వసూలు చేసింది. యశ్ సినిమాకు అంత మార్కెట్ లేదు. అనేది అందరికీ తెలుసు.. కాకపోతే ట్రిపుల్ ఆర్ సినిమా రికార్డుల్ని అయినా కేజీఎఫ్ 2 అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా హిందీ, ఓవర్సీస్ కాకుండా కేవలం సౌత్ ఇండియాలోనే దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసింది. హిందీ, ఓవర్సీస్ అన్నీ కలుపుకుంటే మరో 500 కోట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు కేవలం సౌత్ ఇండియా రికార్డులపై కేజిఎఫ్ 2 కన్నేసింది.
కన్నడలో కచ్చితంగా అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చే సినిమాగా కేజిఎఫ్ 2 నిలవడం ఖాయం అయిపోయింది. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ కన్నడనాట కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు కేజీఎఫ్ దాన్ని తుడిచేసే పనిలో బిజీగా ఉంది. తెలుగులో కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ సత్తా చూపిస్తుంది KGF 2. మొత్తానికి చూడాలి రాకింగ్ స్టార్ ఎన్ని కొత్త రికార్డులకు చెక్ పెట్టనున్నాడో..!
RRR Collections | వరుసగా రెండోసారి 1000 కొట్టిన రాజమౌళి..
“Prashanth Neel | ‘అది నా స్టైల్..సలార్ తాజా కథ’..పుకార్లపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్”
KGF chapter 2 | కేజీఎఫ్ 2 ఖాతాలో అరుదైన రికార్డ్..!”