కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) లీడ్ రోల్ చేస్తున్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. హిందీతోపాటు దక్షిణాది భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..కేజీఎఫ్ 2 గ్రీస్‌లో కూడా విడుదల కాబోతుంది. గ్రీస్‌లో విడుదలవుతున్న తొలి సౌతిండియన్ సినిమాగా రికార్డుల్లో నిలిచిపోనుండటం విశేషం. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ అధీరా పాత్రలో నటించాడు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్.
రవీనాటాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ 2 ట్రైలర్‌కు అద్బుతమైన రెస్సాన్స్ వస్తోంది. మేకర్స్ కేజీఎఫ్ చాఫ్టర్ 1ను మరోసారి నిర్దేశించిన థియేటర్లలో రిరిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.