లైంగిక నేరాలకు ‘రాజధాని’!
ఉత్తర ఢిల్లీలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం నుంచి ఇండ్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలలో మైనర్లపై లైంగికదాడుల వరకు ఈ నెలలో బీజేపీ పాలిత ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) వ్యాప్తంగా కనీసం 13 రేప్, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
- ఢిల్లీలో ఒక్క సెప్టెంబర్లోనే 13 లైంగిక దాడి ఘటనలు
- బీజేపీ సర్కార్పై విమర్శలు..పెరుగుతున్న నేరాలతో ప్రజల్లో ఆందోళన
న్యూఢిల్లీ : ఉత్తర ఢిల్లీలో ఒక యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం నుంచి ఇండ్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలలో మైనర్లపై లైంగికదాడుల వరకు ఈ నెలలో బీజేపీ పాలిత ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) వ్యాప్తంగా కనీసం 13 రేప్, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఆగ్నేయ ఢిల్లీలోని కల్కాజీ ఆలయం వెనుక ఉన్న అటవీ ప్రాంతం వంటి ఆస్థా కుంజ్ పార్క్లో పోలీసులుగా నటిస్తూ ముగ్గురు వ్యక్తులు ఒక 17 ఏండ్ల బాలికను బెదిరించి, రేప్ చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఇది అరుదైన సంఘటనేమీ కాదు. సెప్టెంబర్ ఆరంభం నుంచి ఢిలీ, ఎన్సీఆర్లో డజనుకు పైగా అత్యాచారం, లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి.
వీటిలో చాలావరకు పిల్లలు, టీనేజ్ బాలికలకు సంబంధించినవే. ఈ దాడులు ఇండ్లు, నివాస ప్రాంతాలు, దుకాణాలు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాల్లో జరిగాయి. వీటిలో నిందితులుగా ఉన్నవారు బాధితులకు బంధువులు, పొరుగువారు, అపరిచితులు ఉన్నారు. కల్కాజీ ఘటనలో పోలీసుల్లాగా నటించిన వ్యక్తులు ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి రాజధానిలో రేప్, పోక్సో చట్టం కింద నమోదైన కేసులతో సహా మొత్తం 1,020 లైంగిక నేరాల కేసులు నమోదైనట్టు ఢిల్లీ పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 653 కేసులు పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే పిల్లలకు సంబంధించినవి. మైనర్లకు సంబంధించిన ఘటనల సంఖ్య, అవి నమోదైన వివిధ ప్రాంతాలు, రాజధాని, దాని పరిసర నగరాల్లో మహిళలు, పిల్లల భద్రతపై ప్రశ్నలను మరోసారి చర్చనీయాంశం చేశాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

