RRR Movie Collections | కరోనా తర్వాత సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలామంది కంగారు పడ్డారు. ఎందుకంటే రెండు సంవత్సరాలుగా ఏ సినిమా కూడా మునుపటి స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించలేదు. మధ్యలో కొన్ని సినిమాలు మంచి విజయం సాధించాయి. అయినప్పటికీ ఎక్కడో ఏదో లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. అలాంటి సమయంలో విడుదలైన ట్రిపుల్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించింది. బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాకు మొదటిసారి 1000 కోట్ల క్లబ్ పరిచయం చేసిన రాజమౌళి.. తాజాగా RRR సినిమాతో మరోసారి అదే మ్యాజిక్ చేశాడు.
16 ఈ రోజుల్లో ట్రిపుల్ ఆర్ అధికారికంగా 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేరోజు విడుదలైంది. జక్కన్న మునుపటి సినిమాల స్థాయిలో దీనికి టాక్ రాలేదు.. కానీ కలెక్షన్స్ మాత్రం నెవర్ బిఫోర్ అన్నట్లు వచ్చాయి. మొదటి రోజు 223 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ట్రిపుల్ ఆర్.. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేసింది. వీకెండ్ వస్తే ఇప్పటికే ఈ సినిమాకు సంచలన వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ట్రిపుల్ కూడా 1000 కోట్ల క్లబ్లో చేరడంతో వరుసగా రెండుసార్లు ఈ అరుదైన ఘనత సాధించిన దర్శకుడిగా రాజమౌళి చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి.. త్వరలోనే మహేశ్ బాబు సినిమాతో బిజీగా కానున్నాడు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది.
“Jr NTR | ఆ ఇద్దరు బాలీవుడ్ డైరెక్టర్లతో రెడీ అంటున్న ఎన్టీఆర్..!”
KA Paul Vs RRR | నేనెప్పుడూ ఆర్ఆర్ఆర్ గురించి వినలేదు : కేఏ పాల్..ఆర్జీవీ రీట్వీట్ ఇదే”
NTR political entry | పొలిటికల్ ఎంట్రీ గురించి జూ.ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్..”
“Kangana Ranaut | సినిమా చూడకుండానే రాజమౌళిని ఆకాశానికెత్తేసిన కంగనారనౌత్..!”