ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jun 19, 2020 , 00:04:23

తండ్రి బాటలో..

తండ్రి బాటలో..

తెలుగు చిత్రసీమలో విలక్షణ హాస్యానికి చిరునామాగా నిలిచారు ఐరెన్‌లెగ్‌ శాస్త్రి.  తనదైన శైలి హాస్యంతో నవ్వుల్ని పండించారు.   దాదాపు 150 సినిమాల్లో కమెడియన్‌గా నటించిన ఐరెన్‌లెగ్‌శాస్త్రి 2006 జూన్‌ 19 కన్నుమూశారు. నేడు ఆయన వర్థంతి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన  ప్రేమఖైదీ, అప్పుల అప్పరావు, ఏవండీ ఆవిడొచ్చింది, జంబలకిడిపంబ, ఆవిడ మా ఆవిడే, పేకటపాపారావుతో పాటు పలు సినిమాలు ఐరెన్‌లెగ్‌ శాస్త్రికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. తండ్రిబాటలోనే ఆయన తనయుడు ప్రసాద్‌ అడుగులు వేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి హీరోగా రూపొందిన ‘జంబలకిడిపంబ’ సినిమాలో నటించారు. తండ్రితో తనకున్న అనుబంధం గురించి ప్రసాద్‌ మాట్లాడుతూ ‘నవతరం దర్శకులు  కొందరు నాన్నను గుర్తుచేసుకుంటూ నాకు అవకాశాలివ్వడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాను. నాన్న చనిపోయిన తర్వాత కాదంబరి కిరణ్‌, సంపూర్ణేష్‌బాబు తదితరులు ఆర్థిక సహాయాన్ని అందించారు’ అని తెలిపారు.

VIDEOS

logo