Saif Ali khan | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (Saif Ali khan)పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారని తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad)ను శనివారం అర్థరాత్రి 2.50గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేసి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు.
భారత్‌లోకి అక్రమంగా..
కాగా విచారణకు సంబంధించి ఓ పోలీస్ అధికారి కీలక విషయాలను వెల్లడించారు. ఏడు నెలల క్రితమే మేఘాలయాలోని డౌకీనదిగుండా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆ తర్వాత విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్న నిందితుడు పశ్చిమ బెంగాల్లో వారం పాటు ఉన్నాడు. ఉద్యోగాన్ని వెతుక్కుంటూ ముంబైకి వచ్చాడు. అయితే ముంబైకి వచ్చే కొన్ని వారాల ముందు ఓ స్థానిక వ్యక్తి ఆధార్ కార్డు మీద సిమ్ తీసుకున్నాడు. ఈ సిమ్ కార్డు పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి పేరుమీద రిజిస్టర్ అయి ఉంది. నిందితుడు కూడా భారత్‌లో ఉంటున్నట్టు ఆధార్ తీసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడని చెప్పుకొచ్చారు.
నిందితుడు ఈనెల 16న సైఫ్ అలీఖాన్ ఇంటికి చోరీకి వెళ్లి అతడిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్‌ను దుండగుడు ఆరుసార్లు కత్తితో పొడిచాడు. గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ ఘటన జరుగగా.. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆరు రోజుల చికిత్స అనంతరం సైఫ్ అలీఖాన్ ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
వారం పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్‌కు డాక్టర్లు సూచించారు. అదేవిధంగా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకు ఎక్కువమంది ఆయన వద్దకు రాకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
Jailer Villain | మద్యం మత్తులో జైలర్ విలన్ వినాయకన్ వీరంగం.. ఇంతకీ ఏం చేశాడంటే..?
Jaat Movie | సన్నీడియోల్-గోపీచంద్ మూవీ కోసం ఏకంగా నలుగురు యాక్షన్ డైరెక్టర్లు.. !
Sankranthiki Vasthunam | ఓవర్సీస్లోనూ తగ్గేదేలే.. వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం అరుదైన ఫీట్