Ilaiyaraaja | తమిళ హీరో అజిత్ (Ajith) నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). దర్శకుడు అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ రూపొందిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు (Music maestro) ఇళయరాజా (Ilaiyaraaja) తాజాగా షాక్ ఇచ్చారు. మేకర్స్‌కు లీగల్ నోటీసులు పంపారు (legal notice). ఈ సినిమాలో గతంలో తాను స్వరపరిచిన మూడు పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు.
‘నాట్టుపుర పట్టు’ అనే తమిళ చిత్రం నుంచి ‘ఓథ రుబాయుమ్ తేరెన్’, ‘సకలకళా వల్లవన్’ అనే తమిళ చిత్రం నుంచి ‘ఇలమై ఇధో ఇధో’ పాట, ‘విక్రమ్’ చిత్రంలోని ‘ఎన్ జోడి మంజ కురువి’ పాటలను తన అనుమతి లేకుండా రీ క్రియేట్ చేసి అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంలో వాడారని తెలిపారు. అందుకుగానూ రూ.5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు సినిమాలో ఆ సాంగ్స్‌ను వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పాలని కోరారు. మరోవైపు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, సునీల్, ప్రభు ఇతక కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
“Ajith | అజిత్ సినిమా గట్టెక్కిందా.. రెండు రోజులలో ఎన్ని కలెక్షన్స్ రాబట్టింది అంటే..!”
“Ajith | సినిమా విడుదలైన 8 గంటల్లోనే అజిత్ మూవీ హెచ్ డీ ప్రింట్ లీక్..షాక్‌కి గురైన నిర్మాతలు”