Ajith | తమిళ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే అజిత్ తాజాగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. టాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ రూపొందిన ఈ చిత్రానికి నవీన్ ఏర్నెనీ, వై రవి శంకర్ నిర్మాతలుగా వ్యహరించారు . ఏప్రిల్ 10న ఇండియాలోని ఐదు ప్రధాన ప్రాంతీయ భాషలతో పాటు ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. హీరోయిన్ త్రిష కృష్ణన్ కథానాయికగా నటించగా, అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు.
ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ కూడా జోరుగా నిర్వహించడంతో భారీగానే ఖర్చైందని అంటున్నారు. దాదాపు రూ.300 కోట్ల వరకు చిత్రానికి ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ ద్వారా రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ పండింతులు అంటున్నారు.ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు చెబుతున్నమాట. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని తమిళనాడులో 2400 స్క్రీన్స్, వరల్డ్ వైడ్ గా రూ.3000 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెద్ద ఎత్తునే జరిగింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్లు కూడా భారీగానే అందాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ 1వ రోజు ఇండియా నెట్ 29.25 కోట్ల నెట్ వచ్చినట్టు సమాచారం. తమిళంలో రూ.28.15 కోట్ల నెట్, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ అందుకుంది. ఇక ఇండియా గ్రాస్ 34.40 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.30.4 కోట్లు ఓపెనింగ్ డేనే అందుకొని మొదటి రోజునే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ మూవీ రికార్డుల్లోకి ఎక్కింది. వరల్డ్ వైడ్ గా అంటే ఇండియా + ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని రూ.51.40 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక 2వ రోజు ఇండియా నెట్ రూ.13.50 కోట్ల వరకు వసూళ్లు చేయగా, ఇండియా గ్రాస్ రూ.16 కోట్లు వసూళ్లు చేసిందని ఏర్లీ ఎస్టిమేట్స్ చెబుతున్నాయి. రెండవ రోజు కలెక్షన్స్ భారీగా డ్రాప్ కావడంతో పాటు ఆక్యుపెన్సీ కూడా తగ్గిందట. మరి వీకెండ్లో ఈ చిత్రం ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.