Ram Gopal Varma | ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఏపీ పోలీసులు రెండు సార్లు నోటీసులు పంపినప్పటికీ.. విచారణకు వెళ్లలేదు వర్మ. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు.
కాగా తానేనెక్కడికీ పారిపోలేదు. చట్టాన్ని గౌరవిస్తా. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదంటూ ట్వీట్లో పేర్కొన్నాడు వర్మ. తాజాగా మీడియాతో వర్మ మాట్లాడుతూ.. నేను పారిపోలేదు.. హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నా. నాపై ఐదు కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉంది. నా రిప్లైపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానన్నాడు. అరెస్ట్ చేస్తారనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ట్వీట్లు పెట్టా. నా ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా? ఏడాది తర్వాత ట్వీట్ చూసిన అతనికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటదా అసలు.. హత్యకేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని.. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటని తనదైన శైలిలో కౌంటర్ వేయగా.. ఇప్పటికే ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash petition)పై ఏపీ హైకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరిన మీదట న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.
Sandeham | ఓటీటీలో హెబ్బా పటేల్ ఫీవర్.. ట్రెండింగ్‌లో సందేహం
Trisha | గెట్ రెడీ.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న త్రిష
Bloody Beggar | బ్లడీ బెగ్గర్ ఓటీటీలోకి వచ్చేశాడు.. కవిన్ సందడి చేసే పాపులర్ ప్లాట్‌ఫాం ఇదే