ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి..రికార్డుల వర్షం కురిపించింది. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఇటీవలే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Toronto International Film Festival) కు హాజరైన సంగతి తెలిసిందే.
ఈవెంట్లో మీడియాతో ముఖాముఖిలో ఆర్ఆర్ఆర్కు ప్రపంచస్థాయి ఆదరణ, ఇతర అంశాలపై మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచస్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచినప్పటికీ.. తాను ఇంకా తొలి అడుగులోనే ఉన్నానని అన్నాడు. నేను ఇప్పటికీ తన కథనం, కథన శైలికి కట్టుబడి ఉన్నా. నన్ను నేను నిరంతం చక్కదిద్దుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు.
నా స్టైల్ కథనంతో పాశ్చాత్య ధోరణిలో సాగే సినిమా చేస్తే..ఇక రెండు పడవల మీద ప్రయాణించినట్టే అవుతుందని అన్నాడు. తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నందువల్ల తానింకా మార్గదర్శకుడిని కాదని చెప్పుకొచ్చాడు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో చేయబోయే సినిమాపై ఫోకస్ పెట్టాడు. వరల్డ్ వైడ్ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!