ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ (cruise drug case) కేసులో ఆర్యన్‌ఖాన్ (Aryan Khan)కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. తన కొడుకును ఎలాగైనా బయటకు తీసుకురావాలన్న షారుక్‌ఖాన్ ప్రయత్నాలు ఫలించాయి. దీంతో షారుక్‌ఖాన్‌కు మద్దతు తెలిపిన సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరో మాధవన్ (R Madhavan) ట్విటర్ ద్వారా తన ఎక్జయిట్‌మెంట్‌ను షేర్ చేసుకున్నాడు. డ్రగ్స్ కేసులో షారుక్ కుమారుడు ఆర్యన్‌కు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నాడు మాధవన్ .
ఓ తండ్రిగా ఆర్యన్‌ఖాన్ కు బెయిల్ రావడం నాకు చాలా ఉపశమనాన్ని అందించింది. ఆర్యన్, అతని కుటుంబానికి పాజిటివ్‌గా అంతా మంచి జరుగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ‘థ్యాంక్ గాడ్. ఓ తండ్రిగా నేను చాలా ఉపశమనం పొందాను. ఫైనల్‌గా బెయిల్ మంజూరైంది. బెయిల్ పొందిన ఆర్యన్‌ఖాన్, ఇతర నిందితులకు నా శుభాకాంక్షలు..మీకు మీ కుటుంబానికి ఆ దేవుడి దీవెనలుంటాయని ఆకాంక్షిస్తున్నా.. ’ అని ట్వీట్ చేశాడు మాధవన్.
Thank god . As a father I am So relieved .. … May all good and positive things happen.
— Ranganathan Madhavan (@ActorMadhavan) October 28, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో