ఈ మధ్యకాలంలో వెడ్డింగ్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఏదైనా ఉందా..అంటే..? ఠక్కున గుర్తొచ్చేది టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul), బాలీవుడ్ నటి అతియాశెట్టి (Athiya Shetty). డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే మరోసారి ఇదే వార్త హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ 3 నెలల్లో బ్యాండ్ బాజా మోగించబోతున్నారని, అతియాశెట్టి స్వయంగా పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటోందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాసుకొచ్చాయి.
అయితే ఈ వార్తలను కొట్టిపారేస్తూ తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చింది అతియా శెట్టి. 3 నెలల్లో జరిగే పెళ్లికి నన్ను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను..అంటూ క్యాప్షన్ పెట్టింది. అలాంటిదేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రేజీ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని గతంలోనే వార్తలు రాగా (wedding)..అవన్నీ వట్టి పుకార్లేనని అతియా తండ్రి సునీల్ శెట్టి కొట్టిపారేశాడు.