టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) ప్రాజెక్టు మొదలుపెట్టేందుకు రెడీ అంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో షురూ కానుందని ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చింది. కాగా షూటింగ్ మొదలయ్యే డేట్ ఫైనల్ అయిందని మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏ రోజనేది ఊహించే ఉంటారు
..? మహేశ్ పుట్టినరోజు ఆగస్టులో అని తెలిసిందే.
మహేశ్ పుట్టినరోజైన ఆగస్టు 9న ఎస్ఎస్ఎంబీ 28 రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్నట్టు వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి మహేశ్ బాబు 100 రోజులు డేట్స్ ఇచ్చేశాడని ఇన్ సైడ్ టాక్.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా..ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ నుంచి త్వరలోనే క్లారిటీ రానుంది. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్-మహేశ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.