Music Shop Murthy | అజయ్ ఘోష్ (Ajay ghosh), చాందిని చౌదరి కాంబోలో వచ్చిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
సినిమా ప్రతీ ఒక్కరి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా అజయ్ ఘోష్ అన్నారు. సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
మొదట్లోనే ఈ సినిమా కథపై తనకు నమ్మకం కుదిరిందని చాందినీ చౌదరి చెప్పింది. ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవ్వాలని ఆతృతగా ఎదురుచూశాం. అనుకున్నట్టుగానే జరిగింది. సోషల్ మీడియాలో సినిమా గురించి నడిచిన చర్చ ఎంగేజింగ్‌గా ఉండటంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేకించి డైరెక్టర్ శివకు ధన్యవాదాలు. ఈ సినిమా త్వరలోనే ఇతర భాషల్లో కూడా అందుబాటుకి వస్తుందని చెప్పుకొచ్చింది చాందినీ చౌదరి.
ఇది నాకు మొదటి సినిమా. మ్యూజిక్ షాప్ మూర్తి తెరకెక్కించిన తర్వాత సినిమాలను ఎలా తీయాలి.. ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాలనే అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిందని డైరెక్టర్ శివ అన్నాడు.
Buddy | తక్కువ ధరకే టికెట్.. మూవీ లవర్స్‌కు అల్లు శిరీష్ బడ్డీ మేకర్స్ శుభవార్త
Raja Saab | సూపర్ స్టైలిష్ రాజాసాబ్గా ప్రభాస్ ఎంట్రీ.. మారుతి గ్లింప్స్ అదిరిందంతే..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!
Double ISMART | డబుల్ ఇస్మార్ట్ రొమాంటిక్ మెలోడీగా రామ్, కావ్య థాపర్ Kya Lafda సాంగ్
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్