Buddy | మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యాక్టర్లలో ఒకరు అల్లు శిరీష్ (Allu Sirish). ప్రస్తుతం సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న బడ్డీ (Buddy) సినిమాలో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న బడ్డీ ఆగస్టు 2న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో (Buddy First Glimpse)తో అల్లు శిరీష్ ఈ సారి సరికొత్తగా వినోదాన్ని అందించబోతున్నాడని అర్థమవుతోంది.
విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ మూవీ లవర్స్ కోసం ఆసక్తికర వార్తను అందించారు. బడ్డీ చిత్రాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.99, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 కే వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఉత్తమమైన ధరకు ఉత్తమ వినోదం అంటూ మేకర్స్ తీసుకున్న తాజా నిర్ణయం సినిమాకు కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు సినీ జనాలు.
రౌడీ గ్యాంగ్ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ హింట్ ఇచ్చేస్తుంది. టెడ్డీ మనుషుల్లా ప్రవర్తించడం.. రౌడీలు టెడ్డీని టార్గెట్ చేయడం.. అల్లు శిరీష్ టెడ్డీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే అంశాల చుట్టూ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వస్తున్న బడ్డీలో అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ అలీ, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బడ్డీకి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేళ్ రాజా సమర్పణలో ఆధన జ్ఞానవేళ్ రాజాతో కలిసి నిర్మిస్తున్నారు.
Bestest Entertainment for Best Prices 🔥
Experience #Buddy 🧸 for the lowest prices RS 99/- & Multiplex @ RS 125/- only at theatres near you! 🥳#BuddyTrailer 🔗 https://t.co/XEzQAndNCd
A @hiphoptamizha Musical 🎹
In Cinemas #BuddyFromAug2nd 💥@AlluSirish pic.twitter.com/mrAHilzqgV
— BA Raju’s Team (@baraju_SuperHit) July 29, 2024
Raja Saab | సూపర్ స్టైలిష్ రాజాసాబ్గా ప్రభాస్ ఎంట్రీ.. మారుతి గ్లింప్స్ అదిరిందంతే..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!
Double ISMART | డబుల్ ఇస్మార్ట్ రొమాంటిక్ మెలోడీగా రామ్, కావ్య థాపర్ Kya Lafda సాంగ్
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్