మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 04, 2020 , 19:24:22

నేను ఫెయిర్ నెస్ క్రీమ్స్ పెట్టుకుంటూనే పెరిగాను

నేను ఫెయిర్ నెస్ క్రీమ్స్ పెట్టుకుంటూనే పెరిగాను

ముంబై: రాత్ అకేలి హై సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్దిఖీ. ఇన్ స్పెక్ట‌ర్ జ‌తిల్ యాద‌వ్ పాత్ర‌లో క‌నిపించాడు. క్రైం డ్రామ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలోని జ‌తిల్ యాద‌వ్ రోల్ న‌వాజుద్దీన్ సిద్దిఖీ నిజ జీవిత పాత్ర‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ట. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌య‌మై నవాజుద్దీన్  మాట్లాడుతూ..చిన్న‌త‌నంలో త‌న ముఖం ఛాయ‌ను మెరుగ్గా చేసుకునేందుకు  ఫెయిర్ నెస్ క్రీములు వాడేవాడిన‌ని చెప్పాడు.

అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌నే న‌మ్మ‌కంతో నేను కూడా ఫెయిర్ నెస్ క్రీమ్స్ పెట్టుకుంటూనే ఎదిగాను. అయితే నేను ఉప‌యోగించేది నిజ‌మైన ఫెయిర్ అండ్ ల‌వ్ లీ కాద‌ని గ్ర‌హించ‌లేక‌పోయాను. ఫెయిర్ అండ్ ల‌వ్లీ అని పిలువబ‌డే కొన్ని న‌కిలీ వాటిని ఉప‌యోగించి, న‌న్ను నేను అందంగా మార్చుకునేందుకు చాలా స‌మ‌యం కేటాయించాన‌ని చెప్పుకొచ్చాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo