Loksabhs Elections 2024 | జూన్ 4 తర్వాత కాంగ్రెస్ కనుమరుగు : సాధ్వి నిరంజన్ జ్యోతి
Loksabhs Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆమె పేర్కొన్నారు.
Loksabhs Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఆమె పేర్కొన్నారు. యూపీలోని ఫతేపూర్‌లో గురువారం సాధ్వి నిరంజన్ జ్యోతి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ ప్రకటనను ప్రస్తావించగా అధిర్ రంజన్ టీఎంసీకి ఓటు వేయవద్దని, కాషాయ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారని చెప్పారు.
బీజేపీ క్రమశిక్షణతో కూడిన కార్యకర్తల బలంతో ఎన్నికల్లో పోరాడుతోందని అన్నారు. యూపీలోని 80 స్దానాలనూ కాషాయ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని జోస్యం చెప్పారు.మరోవైపు కాంగ్రెస్‌ను వీడి కాషాయ పార్టీలో చేరిన రాధిక ఖేరా హస్తం పార్టీ లక్ష్యంగా తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణకు చోటులేదని అన్నారు. ఆ పార్టీలో వారు ఎవరూ కలిసి నడవడానికి లేదని, ఒకరిని ఒకరు వెనక్కి లాగుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కాంగ్రెస్ పార్టీలో కేవలం ఓ కుటుంబమే మిగులుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఒకరి తర్వాత ఒకరు వీడుతున్నారని, 30,40 ఏండ్ల నుంచీ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలకు ఏమాత్రం గుర్తింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని గాంధీల అల్లుడు రాబర్ట్ వాద్రా పేరుతో రాసిచ్చేస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వాద్రా యజమాని అని పార్టీలో ఆయన ఏదైనా పొందేందుకు అర్హుడని రాధిక ఖేరా చెప్పారు.
Read More :
Cash Seized | హైదరాబాద్ నుంచి గుంటూరుకు.. రూ.8.40 కోట్లు సీజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

