Naga Vamsi | జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తోన్న చిత్రం వీడీ 12 (VD12). కాప్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతుందని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) ఓ చిట్ చాట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నా సినిమా విషయంలో రిస్క్ చేయాలనుకోవడం లేదు. రెండు పార్టులకు సరిపడా సాలిడ్ కంటెంట్ ఉంది. కానీ ఫస్ట్ పార్టుకు వచ్చిన స్పందనను బట్టి రెండో పార్టు విడుదలపై క్లారిటీ వస్తుంది. గౌతమ్ తిన్ననూరి సినిమాను చాలా సాలిడ్‌గా చూపించబోతున్నాడు. సినిమా సూపర్ హిట్ అని చాలా నమ్మకంతో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు నాగవంశి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
అతని విధి అతని కోసం వేచి ఉంది. తప్పులు.. రక్తపాతం.. ప్రశ్నలు.. పునర్జన్మ.. అంటూ షేర్ చేసిన వీడీ 12 లుక్‌లో పొట్టి హెయిర్, ముఖంపై రక్తపు మరకలు, పొడవాటి గడ్డంలో ఉన్న విజయ్ దేవరకొండ బిగ్గరగా అరుస్తూ కనిపిస్తున్నాడు. స్టన్నింగ్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తూ అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
ఈ మూవీని మార్చి 28న 2025లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. VD12 చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పాపులర్ మలయాళ టెక్నీషియన్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!