Shivalik LPG Tanker : పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో నెలకొన్న వంట గ్యాస్ కష్టాలకు కాసింత తెరపడనుంది. గ్యాస్ కోసం తిప్పలు పడుతున్న కోట్లాదిమందికి ఊరటనిస్తూ భారీ లోడుతో ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ (Shivalik LPG Tanke) సోమవారం గుజరాత్ తీరానికి చేరుకుంది. 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో హర్మూజ్ జలసంధి(Hormuz Strait)ని సురక్షితంగా దాటిన శివాలిక్ నౌక ముద్రా పోర్టుకు రావడంతో అధికారులతో పాటు భారత ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది.
ఇజ్రాయేల్, అమెరికా దాడులతో హర్మూజ్ జల సంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించిన ఇరాన్.. భారత నౌకలను మాత్రం అనుమతిస్తోంది. ఇండియా తమకు దోస్త్ అని పేర్కొన్న ఇరాన్ విదేశాంగ మంత్రి ఎల్పీజీ ట్యాంకర్లను వదిలేందుకు అంగీకరించారు. దాంతో, భారీ ఎల్పీజీ లోడుతో ఉన్న శివాలిక్ ట్యాంకర్ మార్చి 14న సురక్షింతగా హర్మూజ్ జలసంధిని దాటింది.
#WATCH | Gujarat: LPG tanker Shivalik, which crossed the Strait of Hormuz, arrives at the Mundra Port. pic.twitter.com/3E1T1DY4ut
— ANI (@ANI) March 16, 2026
పలు ప్రాంతాల్లో గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్న భారతీయులకు రిలీఫ్నిస్తూ సోమవారం గుజరాత్‌లోని ముద్ర తీరానికి ఈ నౌక చేరుకుంది. మరో ఒకటి రెండు రోజుల్లోనే నందా దేవి (Nanda Devi) నౌక కూడా భారీగా ఎల్పీజీ లోడుతో ఇండియాకు రానుందని ఓడరేవుల శాఖ ప్రత్యేక సెక్రటరీ రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు.
Mundra Port, Gujarat: The LPG tanker Shivalik arrived at Mundra Port via the Strait of Hormuz pic.twitter.com/7nFC8kfCSI
— IANS (@ians_india) March 16, 2026
‘పర్షియన్ గల్ఫ్‌లో ఆగిపోయిన భారత నౌకలన్నీ సురక్షింతగానే ఉన్నాయి. గత 24 గంటల్లో మన నౌకలపై ఎలాంటి దాడులు జరగలేదు. 24 భారతీయ నౌకలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హర్మూజ్ జలసంధికి పశ్చిమం వైపున ఉన్నాయి. వీటిలో ఎల్పీజీ లోడ్‌తో కూడిన శివాలిక్, నందా దేవీ నౌకలు గత రాత్రి/ఈరోజు ఉదయం సురక్షితంగా హర్మూజ్‌ను దాటాయి. ఈ రెండూ భారత తీరానికి వస్తున్నాయి. మరో 22 నౌకలు కూడా త్వరలోనే తిరిగొస్తాయి’ అ ని సోమవారం ఉదయం సిన్హా వెల్లడించారు.