న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ట్యాక్సీ వాలా ఫేం రాహుల్సంకీర్త్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సెట్ కోసం మేకర్స్ పెట్టిన ఖర్చు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
శ్యామ్ సింగరాయ్ కోసం మేకర్స్ కోల్‌కతా బ్యాక్ డ్రాప్ తో రూ.6.5 కోట్లతో భారీ సెట్ వేశారట. మొత్తం 10 ఎకరాల్లో ఈ సెట్ వేసినట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల పర్యవేక్షణలో ఈ భారీ సెట్ వేసినట్టు ఇన్సైడ్ టాక్. ఈ సెట్లో లీడ్ తారాగణంపై వచ్చే కీలక సన్నివేశాలను రాహుల్ సంకీర్త్యన్ చిత్రీకరిస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ విజువల్ ఫీస్ట్ గా ఉండేందుకు నిర్మాత వెంకట్ బోయనపల్లి భారీగానే ఖర్చు చేస్తున్నాడు.
ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. నాని ఇదివరకెన్నడూ కనిపించనట్వంటి కొత్త లుక్‌లో అలరించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన స్టిల్స్ కు మంచి స్పందన వస్తోంది. హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రేక్షకులకు మంచి ఫీల్ కలిగించేలా సినిమాను రూపొందిస్తున్నాడు రాహుల్ సంకీర్త్యన్.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ