HIT-2 Movie Latest Update | యంగ్ హీరో అడివిశేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘మేజర్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అదే జోష్‌తో ‘హిట్-2’ చిత్రాన్ని చేస్తున్నాడు. 2020లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ హిట్‌కు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రబృందం రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయగా.. ఇటీవలే రిలీజైన టీజర్ ఆసక్తిని రెట్టింపు చేసింది. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అనే ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ను ప్రకటించింది.
ఈ చిత్రంలోని ‘ఊరికే ఊరికే’ అంటూ సాగే మెలోడీ వీడియో సాంగ్‌ను నవంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. ఎమ్.ఎమ్ శ్రీలేఖ ఈ చిత్రానికి సంగీతం అందించింది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించింది. ఈ చిత్రంలో అడివిశేష్‌కు జోడీగా మీనాక్షీ చౌదరీ నటిస్తుంది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని నిర్మిస్తున్నారు.
In the darkness of KD’s world, Aarya is the LIGHT. And #UrikeUrike is the Anthem.
We didn’t want just a Lyrical Video. We want you to Witness KD’s love for Aarya in the amazing #UrikeUrike Full Video Song from #HIT2 #UrikeUrike from #HIT2 out on November 10th ❣️#HIT2onDec2 pic.twitter.com/melb9lnGuh
— Adivi Sesh (@AdiviSesh) November 7, 2022
Read Also:
Rahul Ramakrishna | తండ్రి కాబోతున్న రాహుల్ రామకృష్ణ.. ట్వీట్ వైరల్..!
Maniratnam-Kamal Haasan | 35 ఏళ్ళ తర్వాత మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో సినిమా..!
త్రిపాత్రాభినయంలో కళ్యాణ్‌రామ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘NKR19’ ఫస్ట్‌లుక్ పోస్టర్
Vishwak Sen | క్షమించండి సార్.. అర్జున్‌తో వివాదంపై విశ్వక్ సేన్ రియాక్షన్
Hanuman Movie | ‘హనుమాన్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?