Vishwak Sen | క్షమించండి సార్.. అర్జున్‌తో వివాదంపై విశ్వక్ సేన్ రియాక్షన్
Vishwak sen | గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విశ్వక్ సేన్, అర్జున్ సార్జా వివాదం నడుస్తుంది. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ ఫిలిం ఛాంబర్లో ప్రెస్‌మీట్ పెట్టి విశ్వక్సేన్కు కమిట్మెంట్ లేదని సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Vishwak sen | గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విశ్వక్ సేన్, అర్జున్ సార్జా వివాదం నడుస్తుంది. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ ఫిలిం ఛాంబర్లో ప్రెస్‌మీట్ పెట్టి విశ్వక్సేన్కు కమిట్మెంట్ లేదని సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ వల్ల తనకు, తన టీమ్‌కు అవమానం జరిగిందని, తన వల్ల ఎన్నో సార్లు షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. రేపు షెడ్యూల్ స్టార్ట్ అనగా అర్ధరాత్రి ఫోన్ చేసి షూటింగ్ కాన్సిల్ చేద్దాం అని, స్టోరి డిస్కస్ చేసుకుందామని అనే వాడని తెలిపాడు. తన 40ఏళ్ళ ఇండస్ట్రీ కెరీర్లో ఇలాంటి కమిట్మెంట్ లేని నటుడిని చూడలేదని ప్రెస్ మీట్లో చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా అర్జున్ చేసిన ఆరోపణలపై విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యారు. అర్జున్‌తో నెలకొన్న వివాదంపై స్పందిస్తూ ‘ఆరంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇప్పుడు నటుడిగా నిలదొక్కుకున్నాను, ఆ కష్టం తెలుసు కాబట్టి నా అంత కమిటెడ్ ఎవ్వరూ ఉండరు. ఈ ఏడాది నేను మూడు సినిమాలు చేశా.. నా వల్ల ఇప్పటివరకు ఏ నిర్మాత బాధపడలేదు. ఒక్క రూపాయి నష్టపోలేదు. నా సినిమాల సెట్స్ లో పని చేసిన ఏ ఒక్క లైట్ బాయ్ అయినా.. నన్ను కమిటెడ్ కాదు, ప్రొఫెషనల్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా’ అంటూ విశ్వక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా ‘నేనే ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్ అని చెబితే నువ్వు వదిలేయ్. నన్ను నమ్ము అంటూ చెప్పనిచ్చేవారు కాదు. నన్ను కట్టిపడేసినట్లు అయింది. సినిమా నుండి వెళ్లిపోతానని మాత్రం చెప్పలేదు. షూటింగ్ ప్రారంభానికి ముందు నేను క్యాన్సిల్ చేయడం తప్పే. నా వల్ల మీరు ఇబ్బంది పడి ఉంటే క్షమించండి సర్’ అంటూ విశ్వక్ సేన్ రియాక్ట్ అయ్యాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

