Rahul Ramakrishna | తండ్రి కాబోతున్న రాహుల్ రామకృష్ణ.. ట్వీట్ వైరల్..!
Actor Rahul Ramakrishna | 'అర్జున్ రెడ్డి' యాక్టర్ రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రాహుల్, తన భార్య గర్భాన్ని చూపిస్తూ 'మా చిన్ని ఫ్రెండ్‌కు హలో చెప్పండి' అంటూ పోస్ట్ పెట్టాడు.
Actor Rahul Ramakrishna | ‘అర్జున్ రెడ్డి’ యాక్టర్ రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రాహుల్, తన భార్య గర్భాన్ని చూపిస్తూ ‘మా చిన్ని ఫ్రెండ్‌కు హలో చెప్పండి’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటీజన్లు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రాహుల్ పెళ్ళి మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఆ మధ్య ఒక షోలో తనకు త్వరలో పెళ్ళి కాబోతున్నట్లు తెలిపాడు. కానీ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు గాని, న్యూస్ గాని బయటకు రాలేదు. అయితే గత నెలలో రాహుల్, తన భార్యను పరిచయం చేస్తూ ‘నా పిచ్చిని అర్థం చేసుకునే ఒకే ఒక వ్యక్తి’ అని పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌తో తనకు పెళ్లి అయినట్లు క్లారిటీ ఇచ్చాడు.
రాహుల్ రామకృష్ణ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో శివ క్యారెక్టర్లో జీవించేశాడు. ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే లైఫ్ ఎంత బాగుంటుంది అనేంతల ఇంపాక్ట్ చేశాడు. డెబ్యూ సినిమానే అయిన తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్లోనూ ఓ మంచి పాత్ర పోషించాడు. ఈ చిత్రంతో రాహుల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నటుడిగానే కాకుండా సింగర్‌గా, లిరిసిస్ట్‌గా పలు విభాగాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు.
https://twitter.com/eyrahul/status/1589413894904500225?s=20&t=kkWLDG6WBt7ocbRtUzF98Q
Read Also:
Adipurush Movie | సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న ‘ఆదిపురుష్’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
Maniratnam-Kamal Haasan | 35 ఏళ్ళ తర్వాత మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో సినిమా..!
త్రిపాత్రాభినయంలో కళ్యాణ్‌రామ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘NKR19’ ఫస్ట్‌లుక్ పోస్టర్
Vishwak Sen | క్షమించండి సార్.. అర్జున్‌తో వివాదంపై విశ్వక్ సేన్ రియాక్షన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

