Adipurush Movie | సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న ‘ఆదిపురుష్’.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
Adipurush Movie New Release Date | ప్రభాస్ ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన 'రాధేశ్యామ్' డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఆశలన్ని 'ఆదిపురుష్' పైనే ఉన్నాయి.
Adipurush Movie New Release Date | ప్రభాస్ ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఏడాది ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ ఆశలన్ని ‘ఆదిపురుష్’ పైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఇటీవలే రిలీజైన టీజర్‌కు మాత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. VFXపై తీవ్రంగా విమర్షలు వ్యక్తం అయ్యాయి. వీఎఫ్ఎక్స్ సరిగా లేవని, దీనికంటే వీడియో గేమ్ వీఎఫ్ఎక్స్ బాగుందని పలువురు కామెంట్స్ చేశారు. దాంతో చిత్రబృందం మరోసారి వీఎఫ్ఎక్స్ని మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుందట.
‘ఆదిపురుష్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో వీఎక్స్పై మరింత సమయం కేటాయించాలని నిర్ణయించుకుంది. దాంతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ప్రేక్షకులకు మంచి విజువల్ ఎక్స్‌పీరియెన్స్ అందించాలని, వీఎఫ్ఎక్స్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీను జూన్ 16కు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
We are announcing the new release date of our upcoming movie 'Adipurush'! #Adipurush on 16th June, 2023!#Prabhas @omraut #SaifAliKhan @mesunnysingh #Pramod #Vamsi #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @UV_Creations pic.twitter.com/MaOK8aN2Wt
— UV Creations (@UV_Creations) November 7, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weather Changes | ప్రపంచ దేశాల్లో దుర్భరమవుతున్న వాతావరణ పరిస్థితులు.. అధ్యయనంలో వెల్లడి..
‘వరి కొయ్యలను తగలబెట్టవద్దు’
‘ఫ్లోరోసిస్ నివారణలో మిషన్ భగీరథ నీరు కీలకపాత్ర’
Attacking BSF Jawans | బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. ముగ్గురు మహిళలతో సహా 10 మంది అరెస్ట్
AP News | ఈ నెల 23న ఏపీలో మేయర్లు, ఛైర్పర్సన్ల ప్రమాణస్వీకారం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

