Hit-2 Movie Update | ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై అనూహ్య విజయం సాధించిన చిత్రాల్లో ‘హిట్’ ఒకటి. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్, విజన్‌తో ప్రేక్షకులను సినిమా లాస్ట్ వరకు సీట్లలోనే కూర్చోబెట్టాడు. నటుడిగా విశ్వక్సేన్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడు. ఇక ప్రొడ్యూసర్‌గా నానికి ఈ చిత్రంతో భారీ హిట్ వచ్చింది. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న ‘హిట్-2’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం మరో క్రేజీ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్డేట్ను సోమవారం సాయంత్రం 4:59 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కాగా ఈ అప్డేట్ టీజర్ గురించి అయ్యుంటుందని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. అడివి శేష్ ఇటీవలే మేజర్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ‘హిట్-2’ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.
4:59 #HIT2 🔥 pic.twitter.com/gBksTLU3Vd
— Adivi Sesh (@AdiviSesh) October 31, 2022
Read Also:
Adipurush Movie | ‘ఆదిపురుష్’ మూవీ పోస్ట్ పోన్ కానుందా?
Balakrishna | ఆ స్టార్ డైరెక్టర్ బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశాడట..!
Sudheer18 | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘సుధీర్18’ కాన్సెప్ట్ టైటిల్ వీడియో..!
Chiranjeevi | ‘వాల్తేరు వీరయ్య’ లుక్‌ను రీ క్రియేట్ చేసిన 4వేల మంది విద్యార్థులు.. వీడియో వైరల్