Nandhamuri Balakrishna | బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం మంచి స్పీడ్‌లో ఉంది. వయసుతో సంబంధం లేకుండా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. గతేడాది ‘అఖండ’తో మాస్ కంబ్యాక్ ఇచ్చిన బాలయ్య.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘వీరసింహారెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత అనీల్ రావిపూడితో మరో యాక్షన్ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే బాలయ్య మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన పరుశురాం, బాలయ్య కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశాడట. త్వరలోనే ఆయనకు కలిసి కథ వినిపించబోతున్నాడట. మరీ పరుశురాం కథను బాలయ్య ఓకే చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా దీనిపై పలువురు నెటీజన్లు బాలయ్యేమో మాస్, పరుశురాం క్లాస్.. వీళ్ళ కాంబో అస్సలు సెట్ కాదు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పరుశురాం, నాగచైతన్యతో సినిమాకు ముస్తాబవుతున్నాడు.
ఇక బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న వీరసింహారెడ్డి షూటింగ్ చివరి దశలో ఉంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య తండ్రి కొడుకులుగా నటించనున్నట్లు టాక్. బాలకృష్ణకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.