Harom hara Movie | టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం కమర్షియల్ హిట్ కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలను చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన సినిమాలకు పాజిటీవ్ టాక్ వస్తున్నా బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్స్గా మిగిలిపోతున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలింది. ఫలితం ఎలా ఉన్నా సుధీర్‌బాబు మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి.
ఇటీవలే ఈ యంగ్ హీరో తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. 1989 నేపథ్యంలో చిత్తూరులోని కుప్పంలో ఈ కథ జరుగనుంది. డివైన్ టచ్‌తో సాగే పీరియాడిక్ చిత్రమని తెలుస్తుంది. ఈ చిత్రానికి సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టైటిల్ వీడియోను రిలీజ్ చేశారు. టైటిల్ వీడియోతోనే సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాకు హరోంహర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరా సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.