Adipurush Gets Post Poned | ‘బాహుబలి’ వంటి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం డార్లింగ్ ఆశలన్ని ‘ఆదిపురుష్’ సినిమాపైనే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అయితే టీజర్‌కు మొదట మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఆ తర్వాత 3డీలో రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల నుండి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రం పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నందట. కాగా సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక తమిళంలో కూడా అజిత్ తనివు, వారిసు విడుదల కానున్నాయి. దాంతో థియేటర్లు కూడా నాలుగు సినిమాలు పంచుకోవాల్సి వస్తుంది. నాలుగు సినిమాలు ఒకే సారి రిలీజైతే తక్కువగా థియేటర్లు దొరుకుతాయి. ఈ క్రమంలో ఆదిపురుష్ బృందం వెనక్కు తగ్గిందట. పైగా టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో.. మేకర్స్ కూడా వీఎఫ్ఎక్స్ పై మరింత టైం కేటాయించాలని నిర్ణయించుకుందట. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ చిత్రాన్ని సమ్మర్‌కు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రానుంది.
రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్, రెట్రో ఫైల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నాడు.
Read Also:
Vaarsudu Movie | భారీ ధరకు ‘వారసుడు’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్.. వామ్మో అన్ని కోట్లా?
Balakrishna | ఆ స్టార్ డైరెక్టర్ బాలకృష్ణ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశాడట..!
Raviteja | ఆ ఇద్దరు యంగ్ హీరోయిన్లతో రవితేజ రొమాన్స్?
RRR Movie | జపాన్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్ల వేట.. మొదటి ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు..!