Vaarsudu Movie Theatrical Rights | తమిళంలో విజయ్ ధలపతి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ సినిమా వస్తుందంటే తమిళంలో పెద్ద పండగే. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో విజయ్‌కు తమిళనాడులో క్రేజ్ ఉంది. ఫ్లాప్ టాక్‌తోనే బడ్జెట్‌ను రికవరీ చేసే సత్తా విజయ్‌కు ఉంది. అందుకు ‘బీస్ట్’ సినిమానే ఉదాహారణ. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మంచి వసూళ్ళను సాధించింది. ఇక ప్రస్తుతం ఈయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు తమిళంలో భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఒక్క తమిళనాడులోనే వారసుడు చిత్రానికి రూ.75 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట. దీన్ని బట్టే తెలుస్తుంది విజయ్ క్రేజ్ తమిళంలో ఏ స్థాయిలో ఉందో అని. ఇక ఓవర్సీస్లో ఈ చిత్రానికి రూ.38 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకుగా రిలీజ్ కానుంది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.