Raviteja Next Movie | మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలు ఫ్లాప్ అయినా.. రవితేజ మాత్రం సినిమాల వేగాన్ని తగ్గించడం లేదు. ఒక వైపు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే, మరో వైపు కొత్త సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ఈగల్ ఒకటి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రంతో మెగా ఫోన్ పట్టనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పొలాండ్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవలే కార్తికేయ-2తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ ఒకరు కాగా, మరోకరు ఏక్ మిని కథతో బ్లాక్బస్టర్ విజయం సాధించిన కావ్యా తప్పర్. ఈ ఇద్దరు హీరోయిన్లు రవితేజకు జోడీగా ఈ చిత్రంలో నటించనున్నారు. ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ హాలీవుడ్ చిత్రం జాన్విక్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.