Megastar Chiranjeevi | టాలీవుడ్లో మెగాస్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవరం లేదు. ఎనిమిదేళ్ళ పిల్లాడి నుండి ఎనభై ఏళ్ల ముసలివాళ్ల వరకు చిరుకు కోట్లల్లో అభిమానులున్నారు. ఈయన సినిమా రిలీజవుతుందంటే ఫ్యాన్స్ ఒక పండగలా సెలబ్రెషన్స్ చేస్తుంటారు. కాగా తాజాగా మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చిరుపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. 4000 వేల మంది విద్యార్థులు కలిసి వాల్తేరు వీరయ్యలోని లుక్‌ను రీ క్రియేట్ చేశారు. కాలేజీ గ్రౌండ్లో చిరంజీవి రూపంలో కూర్చుని.. వాల్తేరు వీరయ్య లుక్‌ను ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ‘అచార్య’తో ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచిన చిరు.. ఇటీవలే రిలీజైన ‘గాడ్ ఫాదర్’తో ఫుల్ మీల్స్ పెట్టాడు. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ‘భోళా శంకర్’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
The crazy love for Megastar and #WaltairVeerayya has gone to another level 🔥 @KChiruTweets's massy look from the movie recreated with formation by students ❤️🔥
Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/tgXNaeyaPk
— Mythri Movie Makers (@MythriOfficial) October 30, 2022